ప్రముఖ దేవాలయం భద్రాద్రి రామయ్య సన్నిధిలో బూజుపట్టిన లడ్డూలు ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. దీనిపై భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఫంగస్ వచ్చిన లడ్డూ అమ్మకంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భద్రాద్రికి భారీగా తరలివచ్చారు . అయితే దర్శనం తర్వాత భక్తులు ప్రసాదం కోసం లడ్డూ కౌంటర్ వద్ద క్యూ కట్టారు. వారికి ఇచ్చిన లడ్డూలు బూజుపట్టి ఉండటం చూసి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రసాదం కౌంటర్లో ఫంగస్ వచ్చిన లడ్డూలు విక్రయించడం ఏంటని ప్రశ్నించారు.