UPDATES  

NEWS

జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం… మంచి ఆదరణతో దూసుకుపోతున్న ఆరోగ్య మహిళ పథకం.. సింగరేణిలో 60 లక్షలు విలువ చేసే కేబుల్ చోరీ.. మంచినీటి సమస్యపై ఐటీడీఏ అధికారులు కలిసిన బిజెపి నాయకులు.. విద్యార్థులకు “ఆయుష్ న్యూట్రిషన్ కిట్లు” పంపిణీ చేసిన యునాని డాక్టర్ రాజేంద్ర రావు.. ఇటుకలు మీరు మోస్తున్నారా..?  క్రీడా మైదానం పనులు  ప్రారంభించదానికి ఇంత ఆలస్యం ఏంటి ?  ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం… మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం… ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్.. మన ఊరి మనబడి బడ్జెట్లో గండి.. కంటి వెలుగు పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య..

 బతుకు చిద్రం గతి తప్పుతున్న ఆదివాసి యువత

  • బతుకు చిద్రం
  • గతి తప్పుతున్న ఆదివాసి యువత..
  • చదువులకు దూరమై చెడు వ్యసనాలకు బానిసై.
  • జీవితాలు ఆగమాగం

    మన్యం న్యూస్ దుమ్ముగూడెం , జనవరి 06:

చెడు వ్యసనాలే వారి జీవితాలకు శాపం అవుతున్నాయి . చెప్పేవారే లేరని కొందరు చెప్పిన మాట వినని వారు మరికొందరు చెడు వ్యసనాలు వారి బతుకులు చిద్రం చేసుకుంటున్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో యువకులు మత్తు పదార్థాలకు అలవాటు పడి ఉజ్వల భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. పెద్ద చదువులు చదువుకొని జీవితాలను చక్కదిద్దుకోవడమే కాకుండా కనిపించిన తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటారని రెక్కలు ముక్కలు చేసుకుని కూలి పనులకు వెళుతూ కన్న కొడుకులను పెంచుతున్న ఆ తల్లిదండ్రులకు కన్నీరే మిగులుస్తున్నారు. చదువుకొని బతుకులను బాగు చేసుకుంటాడని కలలుగన్న ఆ తల్లిదండ్రులకు మధ్యలోనే చదువు మానేసి మద్యం ,సిగరెట్ గంజాయి లాంటి మత్తు పదార్థాలకు వ్యసనపరులై అ చెడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు. యుక్త వయసులోనే వ్యసనపరులై. సభ్య సమాజానికి తలనొప్పిగా మారుతున్నారు. ప్రధానంగా 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు వ్యసనాలకు బానిసై వారి వారి కుటుంబాలకు బరువై చివరకు జీవత్సవంలా మిగిలిపోతున్నారు యువత మేలుకోవాలని సన్మార్గంలో నడవాలని ప్రభుత్వాలు అనేక విధాలుగా చైతన్య పరుస్తూ వారి చెడు నడవికను మార్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ యువత పెడచెవిన పెడుతున్నారు. లక్ష్యసాధన దిశగా ఎంచుకున్న మార్గాన్ని వారి జీవితాల్లో సుగమనం కావలసింది పోయి మత్తుకు బానిసలై సముదులుగా మిగులుతున్నారు . ఏజెన్సీలో యువత వీటికి ఎక్కువగా బానిస అవుతున్నారు
ప్రధానంగా పల్లెల్లో ఏరులై పారుతున్న మద్యం గుట్టుచప్పుడు కాకుండా రవాణా జరుగుతున్న గంజాయిని నియంత్రించడంలో అధికారులు విఫలమవుతున్నారని మేధావి వర్గం ఆరోపిస్తుంది

యువత మేలుకో జీవితాలను సరిదిద్దుకో.. సీఐ దోమల రమేష్..
సమాజం నిత్యం సస్యశ్యామలంగా ఉండాలంటే యువత ఎందుకు ప్రమాద భూమికగా నిలబడాలి వ్యసనాలకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్న యువత మేలుకోవాలి వారి జీవితాలను సరిదిద్దుకోవాలి. ప్రతిభ ఉన్న యువతకు
ఉద్యోగ నియామకల్లో ఎటువంటి సహాయం కావాలన్నా పోలీస్ శాఖ తరపున అందిస్తామని దుమ్ముగూడెం సీఐ దోమల రమేష్ తెలిపారు. మండలంలోని యువతి, యువకులు ఎవరైనా వచ్చి తెలిపితే వారికి ఉచితంగా కోచింగ్ మా తరఫున అందించడానికి కృషి చేస్తామని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ భారీ నోటిఫికేషన్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని, యువత చెడు వ్యసనాలకు పోకూడదని హెచ్చరించారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !