మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 09: మండలంలోని పైలట్ కాలనీకి చెందిన ప్రతాపగిరి శంకర్ అనే వ్యక్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వీరిది నిరుపేద కుటుంభం కావడం తో పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు ఆదేశాల మేరకు సోమవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు కింటా బియ్యాన్ని వితరణగా అందజేశారు. అనంతరం మణుగూరు జడ్పిటీసి పోశంనర్సింహారావు మాట్లాడుతూ అధైర్య పడవద్దని, ఎలాంటి కష్టం వచ్చిన ఎమ్మెల్యే రేగాకాంతారావు, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముత్యం బాబు, అడపా అప్పారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్, వెంకటరెడ్డి, ముద్దంగుల కృష్ణ, వెంకట్రావ్, మేకలరవి, రాంబాబు, నూకారపు రమేష్, యూసఫ్ షరీఫ్, శ్రీను, గుర్రం సృజన, జక్కం రంజిత్,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.