UPDATES  

 ఆర్యవైశ్య సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

 

మన్యం న్యూస్ చండ్రుగొండ, జనవరి9ః ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తానని ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు పసుమర్తి శేషగిరిరావు అన్నారు. సోమవారం ఆర్యవైశ్య సంఘం మండల కమిటి ఆద్వర్యంలో నూతన సంవత్సరం2023 క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సంఘం బలోపేతానికి ప్రతి యొక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా యువజన విభాగం మాజీ అధ్యక్షులు కొదుమూరి దయాకర్రావు, మండల నాయకులు కుక్కడపు రామారావు,కుక్కడపు వెంకటేశ్వరరావు, చిట్లూరి సుధాకర్రావు, భద్రరావు, ప్మనాధుని క్రిష్ణరావు, నేరేళ్ల లక్ష్మణావు, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !