- ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనను విజయవంతం చేద్దాం
- ఘన స్వాగతానికి అందరూ సిద్ధం కావాలి
- ప్రజా ప్రతినిధుల కార్యకర్తల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే వనమా
మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 09… ఈనెల 12న పలు శాఖ కార్యాలయాలతో పాటు అత్యంత సుందరంగా రూపుదిద్దుకున్న జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభోత్సవానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విచ్చేయుచున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్లో ప్రజాప్రతినిధులు కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామ పంచాయతీ నుంచి వార్డు నుంచి జనాన్ని సమ్మకరించే బాధ్యత ఆయా పంచాయతీలకు వార్డులకు సంబంధించిన ప్రజాప్రతినిధులపైనే ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాల అభివృద్ధిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ప్రత్యేక శ్రద్ధ చూపించి కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేశారని అభివృద్ధిలో సరికొత్త పురోగమనం వైపుకు పయనిస్తుందని అన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు కూడా హాజరై ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పి వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్రావు మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు పంచాయతీ సర్పంచులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.