UPDATES  

NEWS

అరణ్యాన్ని వీడండి కుటుంబంలో కలవండి…. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్.. నలుగురు మావోయిస్టు దళ సభ్యులు లొంగుబాటు… పునరావాసం ఏర్పాటు.. నిఘా ఏర్పాటు అదుర్స్..కమాండ్ కంట్రోల్ ప్రారంభించిన ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్.. బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లో నీటి కొరత.. విజయ్ దేవరకొండకు జంటగా మమితా బైజూ..? ‘సలార్‌2’ రిలీజ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..! దేవర నార్త్ హక్కులను దక్కించుకున్న రెండు దిగ్గజ సంస్థలు.. ‘బేబీ’ సెన్సేషనల్ రికార్డ్. ‘మంజుమ్మల్ బాయ్స్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్.? ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ‘కల్కి2829 ఏడీ’ విడుదల తేదీలో మార్పు..? మోదుగుల గూడెం గ్రామంలో వైద్య శిబిరం..60 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాము డాక్టర్ మనిష్ రెడ్డి..

 వలస గిరిజనేతరులను ఏజెన్సీ నుండి పంపించాలి : రాజ్యాంగ హక్కులను అమలు చేయాలి

వలస గిరిజనేతరులను ఏజెన్సీ నుండి పంపించాలి
*రాజ్యాంగ హక్కులను అమలు చేయాలి
*సుప్రీం కోర్టు న్యాయ వాది శ్రీకాంత్ స్మిత.

మన్యం న్యూస్, వెంకటాపురం:
ఆదివాసీలకు కల్పించిన హక్కులను పాలకులు అమలు చేయాలని
ఆదివాసీ నవ నిర్మాణ సేన గత నలభై రోజులుగా ఆదివాసీ అస్తిత్వ పోరాట యాత్ర చేపట్టడం జరిగింది. వలస గిరిజననేతరులు ఏజెన్సీ వదిలి వెళ్ళిపోవలి అ నీ సోమవారం ఏ ఎన్ ఎస్ ఆధ్వర్యంలో సుమారు 2500 మంది ఆదివాసి లు సంస్కృతి సాంప్రదాయ నృత్యాలతో, కొమ్ము నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. . వలస గిరిజనేతరులను ఏజెన్సీ ప్రాంతం నుండి వెళ్లిపోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ. సభ ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం ఏ ఎన్ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు మాట్లాడుతూ వలస గిరిజనేతరుల ను ఏజెన్సీ నుండి పంపించాలని, వలసల వల్ల ఉన్నవారికి వారి మనగడకు ఇబ్బందికరంగా మారుతున్నారని తెలియజేశారు.ఏజెన్సీ సంపద మొత్తం దోచుకుంటు ఏజెన్సీ ఆదివాసీలను అత్యంత పేదరికం లోకి నేడుతున్నారని ఆదివాస సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షులునర్సింహా మూర్తి తన ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం ఆదివాసీల కోసం ఏర్పాటు చేసిందని ముఖ్య అతిధి సుప్రీం కోర్టు న్యాయవాది శ్రీకాంత్ స్మిత్ పూసాల తెలియజేసారు. రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కల్తీ వీరమళ్ళు మాట్లాడుతూ ఆదివాసీలు అంతా రాజకీయ పార్టీలను వీడనాడాలని .రాజకీయ పార్టీలను వీడితేనే అభివృద్ధి సాధ్యం అన్నారు. ఏజెన్సీ చట్టాలు అమలు కాకపోవడానికి కారణం పాలకులు వాళ్ళు పెట్టిన రాజకీయ పార్టీలు అని వక్తలు ముద్ద రాజు, వీర భద్రం అన్నారు. వలసలను నిరోధించక పొతే ఆదివాసీలు నష్టపోవాల్సి వస్తుందని. వలస వాదులు ఏజెన్సీ వదిలి వెళ్లకపోతే స్వయం పాలన కోసం ఉద్యమిస్తామని సభా వేదికగా న్యాయవాది వాసం ఆనంద్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో ఆదివాసీ అడ్వకేట్ అసోసియేషన్ నాయకులు అరేం పాపారావు, సున్నం రమేష్, చింత సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !