మన్యం న్యూస్,భద్రాచలం:
భద్రాచలం రామాలయంలో ఉద్యోగులుసోమవారం ధర్నాకు దిగారు. లడ్డూ ప్రసాదం బూజుపట్టిన విషయంలో పోలీసులు, దేవాలయ సిబ్బంది మధ్య వివాదం నడుస్తోంది. లడ్డూ విక్రయశాలను సీజ్ చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. ఆలయ సిబ్బంది పోలీసులను అడ్డుకుని ఆందోళన నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు, సిబ్బంది లడ్డూ కౌంటర్ వద్ద ధర్నా చేపట్టారు.