మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 09 … భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈ నెల 12వ తేదీన నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించుటకు ముఖ్యమంత్రి వస్తున్నందున అన్ని
ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని అన్ని శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యాలయం ప్రారంభోత్సవంలో అధికారులకు
కేటాయించిన విధులను అంకితభావంతో నిర్వహించాలని చెప్పారు. ఆహ్లాదకర వాతావరణంలో నిర్మించిన నూతన కలెక్టరేట్లోకి అన్ని శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యాలయాలను పరిశుభ్ర పరిచి అందంగా
అలంకరించాలని చెప్పారు. మంగళవారం సాయంత్రం వరకు అన్ని ఏర్పాట్లును అధికారులు పూర్తి చేసి సంసిద్ధంగా ఉండాలని చెప్పారు. వాహనాలు పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని రవాణాశాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమం సజావుగా సక్రమంగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు
చేసిన హెలిప్యాడ్ను పరిశీలించారు. బహిరంగసభ నిర్వహించుటకు ఏర్పాట్లును పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం
చేశారు. అన్ని శాఖల అధికారులు శాఖాపరంగా ప్రగతి నివేదికలు అందచేయాలని చెప్పారు. విదులు కేటాయించిన అధికారులు తక్షణమే ఆయా శాఖల అధికారులకు రిపోర్టు చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్ అండ్ బి ఈఈ భీమ్లా, డిఆర్డిఓ మధుసూదన్ రాజు,
డిపిఓ రమాకాంత్, డిసిఓ వెంకటేశ్వర్లు డీఎస్పీ వెంకటేశ్వర బాబు, ఉద్యాన అధికారి మరియన్న, ఆర్డీఓ సులోచనారాణి, జిల్లా వైద్యాధికారి డాక్టర్
శిరీష, పశుసంవర్ధక అధికారి డాక్టర్ పురందర్ తదితరులు పాల్గొన్నారు.