మన్యం న్యూస్, సారపాక , జనవరి 09..
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు తీవ్రంగా గాయపడిన సంఘటన సారపాక పంచాయతీలోని ఐటిసి ఈస్ట్ గెట్ సమీపంలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… బుధవారం సారపాక పంచాయతీకి చెందిన సావిత్రమ్మ అనే వృద్ధురాలు సారపాక సెంటర్ నుంచి ఇంటికి వెళ్తుండగా ఐటిసి ఈస్ట్ గెట్ సమీపంలో లారీ ఢీకొట్టడంతో రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో లారీ టైర్లు ఆమె కాలుకు తగులుతూ వెళ్ళగా ఆమె రెండు కాళ్లకు తీవ్రంగా గాయాలయి రక్తస్రావం జరిగింది. స్థానికులు గాయపడిన వృద్ధురాలని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.