UPDATES  

NEWS

కాంగ్రెస్ జోరు, బి ఆర్ ఎస్ బేజారు…ములుగు గడ్డ మళ్ళీ సీతక్క అడ్డా… గెలుపు ఓటములు సహజం…ఓడినా కూడా ప్రజల తోనే ఉంటా, ప్రజల కోసమే పాటుపడతా… బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి… భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా…..ఎన్నాళ్ళ కల నెరవేరింది….నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా…..తెల్లం భద్రాద్రి కొత్తగూడెం విజేతలు వీరే..మూడు సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలుపు..భద్రాచలంలో గులాబీ జెండాకు పట్టం.. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతం…సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు..జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక.. ఓట్ల లెక్కింపు ఇలా… అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ..! అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు.. ఒక్కరోజు ఆగండి.. మీమేంటో చూపిస్తాం..! కూనంనేని గెలిస్తే చక్రం తిప్పుతాం.. అనుమతి లేకుండా ర్యాలీ తీయవద్దు.–ఎస్సై పుష్పాల రామారావు ఓట్ల లెక్కింపు సర్వం సిద్ధం చేసిన అధికారులు..

 మదినిండా ఉప్పొంగిన ఉత్సాహం గూడెం అంతా గులాబీ మయం

మదినిండా ఉప్పొంగిన ఉత్సాహం
గూడెం అంతా గులాబీ మయం
ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం ఎదురుచూస్తున్న జనం
సకలం ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగం

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 10… బీఆర్ఎస్ పెద్ద బాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో కూడా పర్యటిస్తున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రాక కోసం గులాబీ శ్రేణులు ఉప్పొంగిన ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పెద్ద బాసును సాదరంగా ఆహ్వానించేందుకు ప్రజా ప్రతినిధులతో పాటు మంత్రులు శ్రేయోభిలాషులు ఎదురుచూస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కొత్త కూడా నియోజకవర్గ మొత్తం ఇప్పటికే గులాబీమయం అయింది. కొత్తగూడెం రైటర్ బస్తీ లో ఉన్న బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంతో నవభారత్ సమీపంలో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రారంభోత్సవాలకు స్వాగత బ్యానర్లు అడుగడుగున ఆకాశాన్ని అంటాయి. గబాలిస్తున్న గులాబీ తోరణాలు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతానికి తార్కానంగా నిలిచాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రధాన కూడలిలో గులాబీ జెండాలతో రెపరెపలాడాయి. ప్రత్యేక విద్యుత్, బంతిపూల అలంకరణలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయం ముస్తాబయింది. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చేత లాంఛనంగా ప్రారంభించుకొనే ఈ కార్యాలయాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ తో పాటు వివిధ శాఖల అధికారులు శక్తి వంచన లేకుండా ముమ్మర ఏర్పాటులో నిమగ్నమయ్యారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రాకను స్వాగతిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో నుంచి సుమారు 2000 మంది ప్రజలను సమీకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ కాంతారావు మంగళవారం బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి పిలుపునిచ్చారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం తో పాటు పోలీస్ యంత్రాంగం కొత్తగూడెం నియోజకవర్గంలో ఎక్కడికక్కడే భారీ బందోబస్తు ఏర్పాటు చేసేందుకు జిల్లా ఎస్పీ వినీత్ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు సిబ్బంది శక్తి వంచన లేకుండా పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చేత ప్రారంభించుకునేందుకు సిద్ధంగా ఉన్న జిల్లా కలెక్టరేట్, బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయాలను ముందస్తు భద్రత కోసం జిల్లా ఎస్పీ వినీత్ తన పోలీస్ సిబ్బందితో పూర్తి స్థాయిలో పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కానుండడంతో ఎలాంటి ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్కు అంతరాయం కాకుండా తగు జాగ్రత్తలను తీసుకుంటున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !