మన్యం న్యూస్,అశ్వాపురం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మండలంలోని ఎలకలగూడెం గ్రామంలో కలేటి నాగేశ్వరరావు పూరి గుడిసె ఇటీవలే విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూర్తిగా దగ్ధమైన సంఘటన. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికిఅండగా మంగళవారం మండల బి. ఆర్.ఎస్ పార్టీ నాయకులు కలేటి నాగేశ్వరరావు కుటుంబానికి 50 కేజీ ల బియ్యం,రూ.10వేల ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో మండల బి. ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ యాదవ్,జడ్పిటిసి సూదిరెడ్డి సులక్షణ,వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి,సీనియర్ నాయకులు జలే రామకృష్ణ రెడ్డి,సూదిరెడ్డి గోపాలకృష్ణారెడ్డి,నేలపట్ల సత్యనారాయణ రెడ్డి,ఐతం సత్యనారాయణ,దావా వీరస్వామి,గొందిగూడెం ఎంపీటీసీ కొమరం చిట్టెమ్మ,గొందిగూడెం_కొత్తూరు సర్పంచ్ పరిష్క సూరిబాబు,మండల బి. ఆర్.ఎస్ పార్టీ ప్రచార కార్యదర్శి గడకారి రామకృష్ణ,మండల మైనార్టీ అధ్యక్షులు ఎస్కే నయీమ్,మండల ఎస్సి సెల్ అధ్యక్షులు గొర్రెముచ్చు వెంకటరమణ,మండల నాయకులు ముత్యాల నరసింహారావు,పిట్టా శ్రీను,ఈసంపల్లి పున్నారావు,జూపెల్లి కిరణ్,కరకాపల్లి డేవిడ్,మండల సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి గజ్జి లోహిత్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు