మన్యం న్యూస్, మణుగూరు, జనవరి 10:
ఈనెల 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మణుగూరు జడ్పీటీసీ పోషం నరసింహారావు అన్నారు. ఆయన మంగళవారం పినపాక నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు, యువ నాయకులు, మహిళలు అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. సభ విజయవంతానికి ప్రతి ఒక్క నాయకుడు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీ, సర్పంచులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.