మన్యం న్యూస్ మంగపేట. మంగపేట మండలం లోని రమణక్కపేట గ్రామం లో కనీస అవసరాలకోసం మంచినీళ్ళు లేక గ్రామ ప్రజలు తీవ్రంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని భారత ప్రజాతంత్ర యువజన సమైఖ్య డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఏవో కు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్ మాట్లాడుతూ మండలంలోని రమణక్కపేట లో విజయరావుపేట కాలని లో మిషన్ భగీరథ నీళ్ళు రాక, వచ్చినా కానీ ఒక్క బిందె, రెండు బిందెల కంటే ఎక్కువ రావడం లేదు, ఒక్క రోజు నీళ్ళు వచ్చిన కానీ రెండు రోజుల వరకు నీళ్ళు రాక గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆయా సమస్యపై పలుమార్లు గ్రామ మండల అధికారుల దృష్టికి తీసుకుపోయీనా కూడా సమస్య ను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూన్నారని అన్నారు.గ్రామ పంచాయతీ పరిధిలోని నళ్లాల బోరు ఉన్నాగాని పైపులు లేవని నీటి సరఫరా చెయ్యడం లేదని, అందువలన గ్రామ ప్రజలకు కనీసం అవసరాలకు కూడా నీళ్ళు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి కైన అది కారులు స్పందించి మిషన్ భగీరథ ద్వారా నీళ్ళ పంపిణీ సమస్య, గ్రామ పంచాయతీ బోరు పైపులైన్ నిర్మాణ సమస్య ను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డి.వై.ఎఫ్.ఐ నాయకులు రమేష్, సాయి తదితరులు పాల్గొన్నారు
కార్యక్రమంలో రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.