మన్యం న్యూస్, సారపాక :
సారపాక పట్టణంలోని సెయింట్ ధెరిస్సా హైస్కూల్ (ఇంగ్లీ ష్ మీడియం) సిల్వర్ జూబ్లీ వేడుకలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఓసిడి ఫాదర్ జయరాజు బొల్లికొండ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ… సారపాకలో సెయింట్ ధెరిస్సా హైస్కూల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించి 25 సంవత్సరాల సందర్భంగా వేడుకలు నిర్వహించటం అభినందనీయమని ఆయన అన్నారు. క్రమశిక్షణ, విలువలతో కూడిన నాణ్యమైన ఉత్తమ విద్యను అందించడమే ప్రధాన ధ్యేయంగా తాము పని చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పాఠశాల మేనేజర్ ఫాదర్ సతీష్ అధ్యక్షత వహించారు. సిల్వర్ జూబ్లీ సంబరాల నేపథ్యంలో పాఠ శాల విద్యార్థినీ, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సబికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వివిధ రకాల వేషధారణలో చిన్నారుల నృత్య ప్రదర్శ నలు అబ్బురపరిచాయి. అదేవిధంగా పాఠ శాల అభివృద్ధి కోసం వివిధ రంగాలలో పని చేసిన ఉపాధ్యాయులను, పాఠశాల యాజమాన్యం ఫాదర్స్ ను ఈ సందర్భంగా శాలు వాలతో, పూలమాలతో ఘనంగా సత్క రి





