UPDATES  

 పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు చీరలు పంపిణీ

మన్యం న్యూస్ చర్ల,జనవరి 12:
మండల కేంద్రానికి చెందిన కొమరవరపు రవి,శ్రీలత ల కుమారుడు వీక్షిత్ జన్మదినోత్సవం సందర్భంగా మీకోసం మేమున్నాం సహాయక సమితి ఆధ్వర్యంలో గురువారం గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులకురూ. 5వేల విలువ గల చీరలు పంపిణీ చేయడంజరిగింది. ఈ సందర్భంగా మీకోసం మేమున్నాం స్వచ్ఛంద సంస్థ మండల అధ్యక్షులు లయన్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ… ఇండ్లలో జరిగే శుభకార్యాలతో తోటి వారికి సహాయ దాదామే గుణం ఎంతో ఆనందించదగ్గ విషయమని తెలిపారు. ప్రతి ఒక్కరూ సాటివారికి సహాయపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొమరవరపు రవి, వీక్షిత్, ఫణిశ్రీ, గొట్టిపాటి శ్రీనివాసరావు, నర్సిమూర్తి, దొడ్డ ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !