మన్యం న్యూస్ అన్నపురెడ్డిపల్లి, జనవరి20 : మండల కేంద్ర పరిధిలోని ఎర్రగుంట గ్రామంలో జెడ్పీఎస్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా ప్రోగ్రామింగ్ అధికారి బానోత్ పరిష్య నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 48 కేంద్రాల్లో కంటి వెలుగు కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుందన్నారు.ఈ కంటి వెలుగు కేంద్రలలోని ప్రతి రోజు ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయని సంబంధిత వైద్య సిబ్బంది దగ్గర పరీక్షలు చేయించుకోవాలన్నారు.అవసరమైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్లద్దాలు కూడా పంపిణీ చేస్తారన్నారు.కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎర్రగుంట పిహెచ్సి డాక్టర్ ప్రియాంక,డివైపిఎంఓ బి.నాగేశ్వరరావు,డిపిఏంఓ వెంకటేశ్వరావు,వైద్య సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.