మన్యం న్యూస్, అశ్వారావుపేట, జనవరి 22:
అశ్వరావుపేట పట్టణంలో స్థానిక పోలీస్ స్టేషన్ నందు అశ్వరావుపేట ఐక్యత ప్రెస్ క్లబ్ విలేకరుల సమక్షంలో తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ద్వారా వెలువడిన మన్యం న్యూస్ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ను ఆదివారం సిఐ బొమ్మెర బాలకృష్ణ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ బాలకృష్ణ మన్యం న్యూస్ ప్రతినిధి డి చంటి కి స్వీట్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై బి రాజేష్ కుమార్, స్థానిక విలేకరులు ఉదయ్ రాఘవేంద్ర, పెనుగొండ సత్యనారాయణ, సోమేష్, చెన్నరావు, రవి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.