మన్యం న్యూస్, పినపాక:
మండల పరిధిలోని గోపాలరావుపేట గ్రామానికి చెందిన
కూనారపు ప్రసాద్ అమెరికాలో కొన్ని సంవత్సరాల నుండి ఉద్యోగరీత్యా స్థిరపడి ఉన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అమెరికా తెలుగు సంఘంనకు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గా ఆయన నియామకం జరిగింది. విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు ఆయన నియామకం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఆయన పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలను చేసి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. గత సంవత్సరం జూలై నెలలో వచ్చిన వరదల కారణంగా వరద బాధితులకు నిత్యవసరాలను పంచి ఆపద కాలంలో ఆపద్బాంధవుడైనాడు.