మన్యం న్యూస్ ఇల్లందు ఫిబ్రవరి02:- ఇల్లందు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గురువారం ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియని కలిసి విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించేలా కృషి చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యు) ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు ఏ సాంబ మాట్లాడుతూ రేపటినుండి ప్రారంభం కానున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలలో విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించేలా ప్రజాప్రతినిధులు అందరు కూడా కృషి చేయాలనీ కోరారు. విద్యారంగానికి సరిపడా నిధులు లేక రాష్ట్ర విద్యా వ్యవస్థ కుంటుపడుతుందని, పేద విద్యార్థులకు స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ రావడంలేదని అనేక ప్రభుత్వ విద్యాసంస్థల భవనాలు శిథిలావస్థలోనే ఉంటున్నాయని విద్యారంగా బోధన, బోధనేతర సిబ్బంది మరియు సంక్షేమ హాస్టల్లో అధికారులకు మరియు వర్కర్లకు జీతభత్యాలు అందడం లేదని దీనివలన విద్యావ్యవస్థ కుంటు పడుతుందన్నారు. విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించి విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు పిడిఎస్యు జిల్లా కోశాధికారి జె గణేష్, మండల కార్యదర్శి ప్రవీణ్. ప్రభాకర్. సిద్దు. సాయి తదితరులు పాల్గొన్నారు