మన్యం న్యూస్, మంగపేట, ఫిబ్రవరి 07
మంగపేట మండలం రమణక్కపేట యువత కు క్రీడల పట్ల ఉన్న అభిరుచిని గమనించిన శ్రీ రామకృష్ణ సేవాట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగరమేష్ యువత కు వాలీబాల్, నెట్ కొనుగోలు కు మంగళవారం ఆర్ధిక సహాయం అందించారు. ఈ సందర్బంగా శ్రీ రామకృష్ణ సేవాట్రస్ట్ చైర్మన్ నాగరమేష్ మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న ఊరుకుల పరుగుల జీవితం లో మనిషికి శారీరక వ్యాయామం, ఆధ్యాత్మిక తత్త్వం కొరవడింది అని క్రీడలు శారీరకంగా బలంగా ఉండటానికి, ఆరోగ్యం గా ఉండటానికి దోహద పడతాయి, ఆధ్యాత్మిక చింతన మానసిక ఉల్లాసానికి, ఉత్తేజానికి ఉపయోగకరం అని తెలియజేశారు.
