UPDATES  

 వైద్యశాఖ సూపరింటెండెంట్ కలిసిన యూత్ కాంగ్రెస్ బృందం

మన్యం న్యూస్ బూర్గంపాడు ఫిబ్రవరి 07 మండలంలోని పలు హాస్టల్ సముదాయాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కస్తూర్బా, గురుకుల పాఠశాల హాస్టల్లో విద్యానభ్యసిస్తున్న పలువురు విద్యార్థిని విద్యార్థులు సీజనల్ వ్యాధులు తలెత్తకుండా ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించాలని మండల యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం వైద్యశాఖ సూపర్ రెండెంట్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యకాలంలో విషపూరితమైన జ్వరాలు, జలుబు, దగ్గు లాంటి వ్యాధులబారిన పడిన నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యసంరక్షణా దృష్ట్యా తక్షణమే మండల వైద్యాసంబధిత అధికారుల పర్యవేక్షణలో హాస్టల్స్, పాఠశాలలో తక్షణమే మెడికల్ క్యాంప్స్ నిర్వహించి విద్యార్థుల ఆరోగ్యస్థితిగతులపై నిత్యం పర్యవేక్షించాలని కోరారు
హాస్టల్స్, పాఠశాలలో సానిటైజేషన్ తదితర పరిశుభ్రత విషయాలలో సంబధిత అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థుల సంరక్షణకై చొరవతీసుకోవాలని విన్నవించారు.
ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ నాయకులు నిమ్మల హరీష్ యాదవ్ యువజన కాంగ్రెస్ శ్రేణులు నవీన్, కిట్టు, కళ్యాణ్, సతీష్, సాయి రెడ్డి, పార్టీ సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !