మన్యం న్యూస్ గుండాల, ఫిబ్రవరి 12..: మండల కేంద్రంలో జరిగిన గృహప్రవేశ వేడుకకు బీ ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుండాల మండల ఇంచార్జ్ కోలేటి భవాని శంకర్ ఆదివారం హాజరయ్యారు. గుండాల ఇండియన్ ఆయిల్ బంక్ మేనేజర్ అంబటి శ్రీనివాస్ ఆదివారం నూతన గృహప్రవేశ వేడుకలలో భవాని శంకర్ తో పాటు గుండాల మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, భజన విభాగమధ్యక్షలు సయ్యద్ అజ్జు, బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం రమేష్ , ఎస్సీ సెల్ అధ్యక్షులు నిట్ట రాములు, ఎస్టీ సెల్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
