మన్యం న్యూస్ ఇల్లందు ఫిబ్రవరి13.. రోంపెడు మాజీ ఎంపీటీసీ లావుడ్య రాంబాబు అనారోగ్యంతో హైదరబాద్ లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించారు.రాంబాబు (సిపిఐ) ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీనుంచి పరుమర్లు ఎంపిటీసీ గా గేలిచి ప్రజాక్షేత్రంలో పనిచేశారు.సోమవారం నాడు అంతిమ సంస్కార కార్యక్రమంలో ఎంఎల్ పార్టీ నేతలు పాల్గొని పార్థివ దేహానికి ఎంఎల్ పార్టీ జెండా కప్పి శ్రద్ధాంజలి ఘటించారు, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతిమ వీడ్కోలులో.. అవునురి మధు, తోడేటి నాగేశ్వరరావు,సర్పంచు శంకర్ ,అప్పయ్య,వేణు,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
