UPDATES  

 బహుజనుల పట్ల కేసీఆర్ వైఖరి గర్హనీయం

  • బహుజనుల పట్ల కేసీఆర్ వైఖరి గర్హనీయం
  • ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేసిన దళిత ఎమ్మెల్యే మరణిస్తే ప్రభుత్వ లాంఛనాలు వర్తించవా
  • యెర్రా కామేష్ బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 21: బహుజనుల పట్ల కేసీఆర్ వైఖరి గర్హనీయమని,5సార్లు ఎమ్మెల్యేగా చేసిన దళిత ఎమ్మెల్యే సాయన్న మరణిస్తే ప్రభుత్వ లాంఛనాలు వర్తించవా అని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించనందుకు నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీసు అంబేద్కర్ విగ్రహం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరణించిన వారి హోదా వారు చేసిన సేవతో సంబంధం లేకుండా తమకు నచ్చిన వారికి అధికారికంగా అంత్యక్రియలు జరిపిస్తున్న ప్రభుత్వం 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దళిత ఎమ్మెల్యే విషయంలో ఇలా వ్యవహరిస్తుందా ? అని,కేవలం దళితుడు అనే ఓకే ఒక కారణంతో అంత్యక్రియలు అధికార లాంఛనాలతో చేయలేదని ఆంద్ర వాళ్ళు,సినిమా రంగం వాళ్ళు చనిపోతే అధికార లాంఛనాలతో చేసే ముఖ్యమంత్రి ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు.9 సంవత్సరాలుగా అంబేద్కర్ జయంతి,వర్ధంతులకు నివాళులర్పించని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది కేసీఆర్ మాత్రమే అని,నాలుగేళ్ళయినా అంబేద్కర్ విగ్రహన్ని ఏర్పాటు చేయలేదు కానీ వేల కోట్లు ఖర్చు పెట్టి ఆగమేఘాల మీద సెక్రటేరియట్ నిర్మాణం అయ్యిందని విమర్శించారు.అగ్రవర్ణ పార్టీల్లో ఉంటున్న నాయకులు బహుజనుల పట్ల అగ్రవర్ణ పార్టీల వైఖరి తెలుసుకొని బహుజనుల కోసం పోరాడుతున్న బీఎస్పీకీ మద్దతు తెలపాలని కోరారు.
ఈకార్యక్రమంలో సాయి,మాలోత్ వీరు నాయక్,చెనిగారపు నిరంజన్ కుమార్,బొక్క శేఖర్,సరోజ,లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !