- రాజకీయాలను ప్రజలు ఆశీర్వదించి అండగా నిలవాలి….
- -పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్.
- -గతంలో ఎన్నడూ లేని విధంగా పినపాక నియోజకవర్గంలో అభివృద్ధి.
- -పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు.
మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి21: రాజకీయాలను ప్రజలు ఆశీర్వదించి అండగా నిలవాలని పినపాక ఎమ్మెల్యే కాంతారావు అన్నారు. ఆయన మంగళవారం షాపుల మండల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే రోల్ మోడల్ గా ఉన్నదన్నారు. దేశవ్యాప్తంగా అభివృద్ధి సంక్షేమాన్ని విస్తృతం చేసి అమలు చేసేదందుకే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిందన్నారు. పార్టీ అధినేత సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలను ప్రజలు ఆశీర్వదించి అండగా నిలవాలన్నారు. సీఎం కేసీఆర్ గడిచిన 8 ఏళ్ల కాలంలో ప్రజలకు కావలసిన సదుపాయాలు అందించారన్నారు. పేదల సంక్షేమమే పార్టీ ప్రధాన ధ్యేయమన్నారు. పినపాక నియోజకవర్గం లోని అన్ని గ్రామాలకు రోడ్ల సౌకర్యం, బ్రిడ్జిల నిర్మాణం, చెక్ డాంల నిర్మాణంతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరుగుతుందన్నారు. ఎలాంటి అభివృద్ధి చేయని వాళ్ళు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారని, అలాంటి వారికి రానున్న ఎన్నికల్లో ప్రజల బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.