మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి21: ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అసిస్టెంట్ మలేరియా అధికారి గొంది వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన మంగళవారం మున్సిపాలిటీ బాపనకుంట గ్రామం లో నిర్వహించిన మలేరియా పై అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నీటి నిల్వలు లేకుండా చేసుకోవాలన్నారు. లేని పక్షంలో లార్వా పెరిగి దోమలు వృద్ధి చెంది మలేరియా , డెంగీ జ్వరాలు వచ్చే అవకాశం ఉందన్నారు. తప్పనిసరిగా దోమ తెరలు ఉపయోగించుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలో చుట్ట ప్రక్కల వారికి రక్త నమూనా లను సేకరించి మందులు అందజేశారు. 35 ఇళ్ల లో దోమల మందు పిచికారి చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఎన్సి వీ బీ డీ సి కో ఆర్డినేటర్ కృష్ణయ్య, సబ్ యూనిట్ ఆఫీసర్ లింగ్యా నాయక్, రాంప్రసాద్, ఉమెష్ , తార, సరిత తదితరులు పాల్గొన్నారు.