మన్యం న్యూస్, భద్రాచలం , ఫిబ్రవరి 22
మహిళా అండర్-19 ప్రపంచ కప్ లో అద్భుత ప్రతిభను కనబరిచి ప్రపంచ కప్పును ఇండియా అండర్-19 టీం గెలవడంలో కీలక భూమిక పోషించినటువంటి గొంగడి త్రిషను హైదరాబాదులో భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య వారి నివాసంలో బుధవారం సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు వీరయ్య మాట్లాడుతూ… ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని తన బిడ్డని ఈ స్థాయికి తీసుకువచ్చిన తన తండ్రి రామిరెడ్డిని చూస్తే నాకు చాలా గర్వంగా ఉందని, సాధారణంగా ఆడపిల్ల పుడితే డాక్టర్, ఇంజనీరింగ్ చదివించి ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి వేరే ఇంటికి పంపించేస్తారని, కానీ రామిరెడ్డి మాత్రం తన బిడ్డను ప్రపంచం గర్వించదగ్గ క్రీడాకారునిగా తీర్చిదిద్దటం భద్రాచలం ప్రాంతవాసులు నిజంగా గర్వించదగ్గ విషయమని, అలాగే త్రిష కూడా తన తండ్రి కలలను ఎక్కడ ఓమ్ము చేయకుండా కష్టపడి ఈ స్థాయికి చేరుకోవటం ఎంతో గొప్ప విషయమని అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పుట్టిన మట్టిలో మాణిక్యం అని,త్రిష ఇదే కృషి, పట్టుదలతో మహిళా సీనియర్ టీం కి ఆడాలని కోరుకుంటున్నాను అని, తనకు తగిన గుర్తింపు కల్పించాలని అన్నారు.