UPDATES  

 మణుగూరు సింగరేణి ఏరియా లో ఘనంగా రక్షణ వారోత్సవాలు…

మన్యం న్యూస్ మణుగూరు టౌన్, మార్చి 18

మణుగూరు సింగరేణి ఏరియా లో రక్షణ వారోత్సవాలు – 2023 ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 13 నుంచి 21వ తేదీ వరకు సివిల్ డిపార్ట్మెంట్ విభాగంలో ఈ రక్షణ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు.రక్షణ వారోత్సవాల్లో భాగంగా భద్రత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమ ముఖ్య కన్వెనర్ గా ఇల్లందు ఏరియా సేఫ్టీ ఆఫీసర్ పి శ్రీనివాస రావు,ఇల్లందు సేఫ్టీ కమిటీ మెంబర్స్ ఏజి ‌ఎంఈ&ఎం కమలాకర్ భూషణ్,ఏజిన‌ఎం ఎం.గిరిధర రావు,ఎస్‌ఈ సివిల్ డా.డి ఆదినారాయణ,సుపర్వైసర్ సివిల్ ఏ సుధీర్ ఆధ్వర్యంలో ఈ రక్షణ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.సేఫ్టీ కమిటీ సభ్యులు మణుగూరు ఏరియాలో నిర్వహిస్తున్న సివిల్ పనులను,వారు పాటిస్తున్న రక్షణ చర్యలను తనిఖీ చెయ్యడం జరిగింది.ఈ కార్యక్రమ ముఖ్య కన్వెనర్ ఇల్లందు ఏరియా సేఫ్టీ ఆఫీసర్ పి.శ్రీనివాస రావు మాట్లాడుతూ,ఉద్యోగులు,కార్మికులను పని చేసే సమయంలో రక్షణ పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. రక్షణ వారోత్సవాల్లో భాగంగా మణుగూరు ఏరియాలో వివిధ ప్రదేశాల్లో సివిల్ పనులు నిర్వహించే అవుట్ సోర్సింగ్ కార్మికులకు అవగాహన కల్పించారు.రక్షణ పట్ల ప్రతి ఒక్కరూ ఆవగాహనతో ఉండాలని,ప్రమాదాలకు గురి కాకుండా పనులు చేయాలని సూచించారు.తప్పనిసరిగా హెల్మెట్,బూట్లు,రక్షణ బెల్టు ధరించాలన్నారు.సివిల్ విభాగంలో పని చేస్తున్న సింగరేణి ఉద్యోగులకు,కాంట్రాక్ట్ కార్మికులకు వ్యాస రచన పోటీలు నిర్వహించి మొదటి రెండు స్థానాలు పొందిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది.అనంతరం ఏజియ‌ఎం సివిల్ డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ,భద్రత ప్రమాణాలు పాటించాల్సిన అవసరాన్ని,వాటిని అమలు చేసేలా,అవగాహన పెంచేలా, భద్రత అధికారులు,సంబంధిత శాఖ అధికారులు చూడాల్సిన అవసర ఎంతైనా ఉందని అన్నారు.సింగరేణిలో పని చేసే వారికి పటిష్ట భద్రత అవసరమని తెలిపారు. మెరుగైన ప్రమాణాలతో పరిశ్రమల ప్రగతి సాధిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమం లో ఎం‌వి‌టి‌సి మేనేజర్ నాగేశ్వర రావు,డి వై.ఎస్ ఈ సివిల్ రాజేంద్ర ప్రసాద్,ఈ‌ఈ సివిల్ ప్రవీణ్,సుపర్వైజర్ జే నవీన్, ఓవర్సీర్ సివిల్ అజయ్,శ్రవణ్, వి.రవి వర్మ,తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !