మన్యం న్యూస్ కరకగూడెం, మార్చ్ 18 మండల పరిధిలోని రాళ్లవాగు వద్ద మణుగూరు నుంచి వస్తున్న కారు అదుపుతప్పి రాళ్లవాగు బ్రిడ్జి కిందకి దూసుకెళ్లింది. క్షతగాత్రులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి నిర్మల్ జిల్లా సోను గ్రామానికి చెందిన అంజన్న భక్తులు శుక్రవారం పర్ణశాల భద్రాచలం దేవాలయాల్లో దైవదర్శనం చేసుకుని తిరిగి శనివారం వస్తున్న క్రమంలో రాళ్లవాగు బ్రిడ్జ్ కిందికి అదుపుతప్పి దూసుకుపోయినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు స్వల్ప గాయాలైనట్లు తెలిపారు.
