గుంపెన సొసైటీ ఆద్వర్యంలో మహాజనసభ :పిఎసిఎస్ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు
మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి మార్చి 20 :అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని గుంపెన సొసైటీ ఆద్వర్యంలో రైతులతో మహాజనసభను సోమవారం పిఎసిఎస్ ఛైర్మన్ బోయినపల్లి సుధాకర్ రావు నిర్వహించారు.ఈ సభలో రైతులు పరపతి సంఘం యొక్క లావాదేవీలు ధాన్యం కొనుగోలు పై మరియు రుణాలు తీసుకొని సకాలంలో వడ్డీ చెల్లించిన రైతులకు ఏడు శాతం చెల్లిస్తే మూడు శాతం సెంట్రల్ బ్యాంక్ ద్వారా రైతుల ఖాతాలో వెనక్కి వచ్చినట్లు ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు,ఎంపీటీసీ సభ్యులు,సర్పంచులు,సొసైటీ సిబ్బంది మరియు రైతులు,తదితరులు పాల్గొన్నారు