మన్యం న్యూస్,ఇల్లందు టౌన్.. మార్చి21.. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శోభకృత నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యవసాయ రంగంగా పరిగణించే ఈ ఉగాది పండుగ రైతన్న జీవితంలో సుఖసంతోషాలను నింపాలని,పచ్చని పాడిపంటలతో ఇల్లందు నియోజకవర్గ రైతాంగం వర్ధిల్లాలని కోరారు. ఈ శోభకృత నామ ఉగాది పండుగ సంవత్సరం ఇల్లందు నియోజకవర్గ ప్రజలందరి ఇంట సుఖసంతోషాలు వెలివిరుస్తూ భోగభాగ్యాలతో సంతోషంగా జీవించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు