UPDATES  

 భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్..

  • భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు
  •  – నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్
  •  – ప్రతి భక్తునికి తలంబ్రాలు అందేవిధంగా ఏర్పాట్లు
  •  – జిల్లా కలెక్టర్ అనుదీప్

మన్యం న్యూస్, భద్రాచలం :

శ్రీరామనవమి, మహాపట్టాభిషే మహోత్సవాలు నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. శనివారం నవమి, మహా పట్టాభిషేకం మహోత్సవ ఏర్పాట్లును మిథిలా స్టేడియంలో అన్ని శాఖల అధికారులతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సెక్టార్లు ను పరిశీలించారు. వివిఐపిలు, వీఐపీలు జ్యుడిషరీ, భక్తుల సౌకర్యార్థం స్టేడియాన్ని 26 సెక్టార్లుగా విభజించి అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సెక్టార్లు లో భక్తులకు ఇబ్బందులు రాకుండా పర్యవేక్షణకు ప్రతి సెక్టారుకు జిల్లా అధికారిని ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు చెప్పారు. భక్తులు వేడుకలు వీక్షించడానికి వీలుగా అన్ని సెక్టార్లలో ఎల్ఈడి టీవీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రతి సెక్టార్లో మంచినీరు, మజ్జిగ సరఫరా చేయు విధంగా చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. భక్తులు సెక్టార్ లోకి వచ్చినప్పటి నుండి సెక్టార్ నుండి క్షేమంగా బయటకు వెళ్లే వరకు ప్రత్యేక అధికారులదే బాధ్యతని ఆయన సూచించారు. భక్తుల సౌకర్ర్యార్థము సెక్టార్లలో ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. సేవల కొరకు స్వచ్ఛంద సంస్థల సేవలను కూడా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. సెక్టార్ అధికారులు ఉదయం 5 గంటలకే సెక్టార్లకు చేరుకోవాలని ఆయన తెలిపారు. కల్యాణం తదుపరి సెక్టార్ నుండి భక్తులు క్రమ పద్ధతిలో వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రతి భక్తునికి తలంబ్రాలు అనేఉంచాలనే ఉద్దేశ్యంతో 70 తలంబ్రాలు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక ప్రసాదాలు కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతి సెక్టార్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా నియంత్రణ చేసేందుకు అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. అత్యవసర వైద్య సేవలకు అంబులెన్స్లు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. భద్రాచలం విచ్చేయు భక్తులకు సమగ్ర సమాచారం అందించేందుకు సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిపిఆర్ఓను ఆదేశించారు. మరుగుదొడ్లు, స్నానాలు చేయు గదుల సమాచారం భక్తులు తెలుసుకోవడానికి వీలుగా సైన్ సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని చెప్పారు. భక్తులు సలహాలు సూచనల కొరకు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో 08743- 232444 నెంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. హోటలళ్లలో ఆహార పదార్థాలకు ధరలు నిర్ణయించి బోర్డులు ఏర్పాటు చేపించాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయం రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని చెప్పారు.

భక్తులు వాహనాలు పార్కింగ్ స్థలాలు తెలుసుకోవడానికి వీలుగా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, భద్రాచలం ఎస్పి పరితోష్ పంకజ్, డిపిఓ రమాకాంత్, ఉద్యాన అధికారి మరియన్న, ఆర్ అండ్ బి ఈఈ భీమ్లా తదితర శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !