UPDATES  

NEWS

ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం రూ,,272 వచ్చెల చూడాలి..m పని చేసే ప్రభుత్వాన్ని గెలిపించండి… కాంగ్రెస్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు పల్లి కొండ యాదగిరి… వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ సేవలు వెలకట్టలేనివి… శీతల చలివేంద్రం ప్రారంభించిన జాతీయ మిర్చి బోర్డు డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి… శ్రీ నాగులమ్మ కు ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా పూజారుల పూజలు..గండోర్రే గుట్ట వద్ద వనదేవతకు ప్రత్యేక పూజలు.. ‘పరిష్కారమెప్పుడూ యుద్ధరంగంలో లభించదు’.. తాజ్‌మహల్‌పై పిటిషన్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ. హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్..! ఓటీటీలోకి సుందరం మాస్టర్.. పుష్ప నుంచి మరో క్రేజీ అప్‌డేట్..

 డ్రగ్స్ మాఫియా వర్సెస్‌ పవన్‌ కళ్యాణ్‌

పవర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం పలు సినిమాలు రూపొందుతున్నాయి. ప్రతి సినిమా కూడా భారీ అంచనాలతో రూపొందుతున్న విషయం తెల్సిందే. అయితే సాహో సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఓజీ’ విషయంలో మాత్రం అభిమానుల్లో ఇంకాస్త ఎక్కువ అంచనాలు ఉన్నాయి. సాహో సినిమాలో ప్రభాస్ ను విభిన్నంగా చూపించిన దర్శకుడు సుజీత్ విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు.

అందుకే పవన్ కళ్యాణ్ ను కూడా అదే తరహాలో చూపిస్తాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ప్రస్తుతం ముంబై లో చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమా డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్నట్లుగా తెలుస్తోంది. మాఫియా డాన్ గా పవన్‌ కళ్యాణ్ కనిపిస్తాడని.. అదే సమయంలో డ్రగ్స్ మాఫియాతో పవన్ కళ్యాణ్ యాక్షన్‌ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని కూడా సమాచారం అందుతోంది. మొత్తానికి ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారట.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !