మన్యం న్యూస్, పినపాక:
మండల పరిధిలోని ఎల్చిరెడ్డిపల్లి ఆశ్రమ పాఠశాలలో నిర్వహిస్తున్న సిఎం కప్ క్రీడలను పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ గుమ్మడి గాంధీ మాట్లాడుతూ, స్నేహపూర్వక వాతావరణంలో క్రీడలను కొనసాగించాలని, దేహదారుడ్యం పెంపొందాలంటే క్రీడలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.ఈ కార్యక్రమానికి తహశీల్దార్ దుర్గా ప్రసాద్, ఎస్సై పఠాన్ నాగుల్ మీరా ఖాన్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల, అధికారులు, వివిధ గ్రామాల క్రీడాకారులు హాజరయ్యారు.