మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఏప్రిల్ 17::
ఐకెపి వివో ఏల సమస్యలపై ప్రభుత్వం స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని సిఐటియు మండల అధ్యక్షురాలు చిలకమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని లక్ష్మీనగరం ఎస్బిఐ బ్యాంకు ముందు నిర్వహిస్తున్నటువంటి సమ్మె 31 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివో ఏల కనీస కోరికలు తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు గత 20 సంవత్సరాలుగా గ్రామ దీపికలుగా పనిచేస్తూ బ్యాంకు లింకేజీ లోన్స్ రికవరీ చేపించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నటువంటి ప్రభుత్వం పట్టించకపోవడం బాధాకరమని వారికి కనీస వేతనం 26,000 ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ప్రభుత్వం వివో ఏల సమస్యలపై స్పందించేంతవరకు సమ్మె కొనసాగిస్తూనే ఉంటామని అన్నారు ఈ కార్యక్రమంలో వివోఏలు నాగరాజు వెంకటేశ్వర్లు కుమారి లక్ష్మీ పద్మ వెంకట నరసమ్మ తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు