మండలంలో విస్తృత పర్యటన చేసిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.
రూ.1.90 కోట్ల వ్యయంతో వివిధ గ్రామాలలో అంతర్గత సీసీరోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన*
మండుటెండను లెక్క చెయ్యకుండ అభివృద్ధి కార్యక్రలలో పాల్గొన్న ప్రభుత్వ విప్ రేగా
మన్యం న్యూస్ కరకగూడెం:మండల పరిధిలోని కొత్తగూడెం,సమత్ మోతే (గొల్లగూడెం) చొప్పాల, తుమ్మలగూడెం,పద్మపూరం, రఘునాధపాలెం,తాటిగూడెం,వెంకటపూరం,కరకగూడెం,చిరుమళ్ల,వట్టంవారిగుంపు,కన్నాయిగూడెం,రెగళ్ళ,సమత్ భట్టుపల్లి,భట్టుపల్లి గ్రామపంచాయతి లోని వివిధ గ్రామాలలో ఒక్క కోటి తొంబై లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం చెపట్టనున్న అంతర్గత రహదారుల నిర్మణాలకు ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు వివిధ శాఖల అధికారులతో కలిసి మండల వ్యాప్తంగా వివిధ గ్రామలలో నిర్మాణం చెపట్టానున్న సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ పినపాక నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామంలో మట్టి రోడ్డు అనేదే ఉండకూడదనె లక్ష్యంతో ప్రతి గ్రామంలో సిసి రోడ్లు నిర్మాణం చేపడుతున్న మని అన్నారు.అలాగె ఎమైన చిన్న చిన్న అంతర్గత రహదారులు మిగిలి ఉంటె వాటిని కూడా త్వరలోనే పూర్తి చేసే భాద్యత నా పపై ఉంచండని వివిధ గ్రామల ప్రజలకు హమి ఇచ్చారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తూ వాటిని పూర్తిస్థాయిలో ప్రజలకు అందే విధంగా చూస్తుందని అన్నారు. వీటితోపాటు కళ్యాణలక్ష్మి, షాదిముబారక్, రైతుబీమా, రైతు బంధు అనే పథకాలు పేద ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ రేగా కాళికా,తహశీల్దారు ఉషా శారద,డిప్యూటీ తహశీల్దారు సంద్య,సర్పంచ్ లు ఇర్ప.విజయ్ కుమార్,సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు పాయం.నర్సింహరావు, జవ్వాజి,రాధ,గొగ్గలి.నాగమణి,తోలెం.సావిత్రి,తాటి.సరోజినీ,పోలెబోయిన. నర్సింహరావు,పోలెబోయిన పాపమ్మ భూక్య.భాగ్యలక్ష్మి, ఎంపిటీసి ఎలిపెద్ది సైలజ, బిఅర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి అన్వర్ పాషా, మండల అధ్యక్షులు రావుల.సోమయ్య, బిఅర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.