UPDATES  

 ఆదివాసీల జీవన శైలిలో మార్పు రావాలి ఆంధ్రాలో విలీనమైన ఐదు గ్రామపంచాయతీలు

  • ఆదివాసీల జీవన శైలిలో మార్పు రావాలి
  • ఆంధ్రాలో విలీనమైన ఐదు గ్రామపంచాయతీలు
  • తెలంగాణలో విలీనం అయ్యేందుకు కేంద్రం దృష్టికి తీసుకు వెళ్తా
  • నేను తమిళ ఆడబిడ్డ నైనా తెలంగాణ ప్రజలకు అక్కనే
  • భద్రాచలంలో ఆదివాసీల ముఖాముఖిలో రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్
  • గవర్నర్కు ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ అనుదీప్ ,ఎస్పి వినీత్

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

ఆదివాసీల జీవనశైలలో ఎన్నో మార్పులు రావాలని వారి ఆర్థిక స్వావలంబన దిశగా పయనించేందుకు అన్ని రకాలుగా ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్య ఉపాధి రంగాల్లో ఆదివాసీలకు మరింత స్థానాన్ని కల్పించి వారి ఆర్థిక ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్ అన్నారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పర్యటనలో భాగంగా ఆమె తులత శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి వెళ్లి సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో గవర్నర్ను స్వాగతం పలికారు. గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ లక్ష్మీ తార అమ్మవారి ఆలయంలో వేద పండిన చేత ఆశీర్వచనం అందుకున్నారు స్వామివారి ప్రసాదాలను స్వీకరించారు ఆలయానికి వచ్చిన భక్తులను పలకరించారు. భద్రాచలం పర్యటనకు వచ్చినపర్యటనకు వచ్చిన గవర్నర్ తమిళ్ సైకు జిల్లా కలెక్టర్ అనుదీప్ జిల్లా ఎస్పీ వినీత్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి
భద్రాచలం వీరభద్ర పంక్షన్ హాల్ లో ఆదివాసీలతో గవర్నర్ తమిళ సై ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివాసీల ఆరోగ్యం పై అవగాహన కల్పించారు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుల తో సమావేశం అయ్యారు ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ
ఇక్కడి ఆదివాసీ ప్రజల సమస్యలు, ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామ పంచాయతీల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు విన్నానని చాలా బాధ పడుతున్నానని చెప్పారు. అంధ్రలో విలీనమైన 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని కోరిన గిరిజనులకు గవర్నర్ ఇట్టి సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన గవర్నర్ తెలుగులో అందరూ బావున్నారా, అందరూ బావుండాలని సీతారామ చంద్రస్వామిని ప్రార్ధించినట్లు చెప్పారు. తాను తమిళ ఆడబిడ్డనైనా తెలంగాణ ప్రజలకు అక్కనని
ఇక్కడి సమస్యలను అర్దం చేసుకున్నాను అని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా తాను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని చెప్పారు. ఆదివాసీలు సమస్య పరిష్కార బాధ్యతలు అప్పగించారని, తప్పక పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !