మన్యం న్యూస్ మణుగూరు టౌన్ :మే 18
మణుగూరు మండలంలోని సమితి సింగారం,పగిడేరు, రామానుజవరం,చిక్కుడు గుంట, సాంబయిగూడెం, కొండాయిగూడెం గ్రామాల లోని 17 మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం.నరసింహారావు పాల్గొని వారి ఇంటికి వెళ్ళి వారి చేతుల మీదుగా కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.ఈ సంధర్బంగా జెడ్పీటీసీ పోశం మాట్లాడుతూ, కళ్యాణ లక్ష్మి పథకం పేదలకు గొప్ప వరం అన్నారు.కళ్యాణ లక్ష్మి అద్భుతమైన పథకం అని తెలిపారు.వివాహం జరిగిన ప్రతి ఆడపిల్లకు మేనమామ కానుకగా కళ్యాణ లక్ష్మి ద్వారా 1,00,116 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూన్నారు అని తెలిపారు.పేద,మధ్యతరగతి ప్రజలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పరిపాలనలో అద్భుతమైన అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా కులాలకు,మతాలకు అతీతంగా,అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యతనిస్తూ,వారి ఆకాంక్షల మేరకు అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్న,ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని తెలిపారు.సీఎం కేసీఆర్ ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,భిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు,వందల కోట్ల రూపాయలతో నియోజకవర్గం లోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారని,గతంలో ఎన్నడూ లేని విధంగా,ఎవరు చేయని విధంగా అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. అభివృద్ధి,సంక్షేమ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని వారు కోరారు.ఈ కార్యక్రమం లో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, వీఆర్ఏ రాణి,సర్పుంచ్ లు బచ్చల.భారతి,కాయం తిరుపతమ్మ,సొసైటి డైరెక్టర్ పిన్నమనేని మాధవి,వార్డు మెంబర్లు నర్సింహారావు, బిరమ్మ,ఉపేంద్ర,మాధవి,చెన్నకేశవులు,వెంకటసోములు,కణితి ప్రవీణ్,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు,కార్యదర్శి రామిరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీను, కార్యదర్శి ప్రసాద్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు