UPDATES  

 బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రీడలకు ప్రాధాన్యం

  • బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో క్రీడలకు ప్రాధాన్యం
  • సీఎం కప్ విజేతలను అభినందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా కాంతారావు

మన్యం న్యూస్ మణుగూరు టౌన్: మే 25

మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గురువారం నాడు సీఎం కప్ టోర్నమెంటు లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాలీబాల్ లో కరకగూడెం మండలం టీం ప్రథమ స్థానం రావడం పట్ల క్రీడాకారులను, కోచ్ లు కొమరం వెంకట నారాయణ,పిడి.ఎస్.బాల సుబ్రమణ్యం,పిడి.కే.నిరజ్ కుమార్ లను విప్ రేగా కాంతారావు అభినందించారు. ఈ సందర్భంగా విప్ రేగా మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిఅర్ఎస్ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత కల్పించడం జరిగింది అన్నారు.క్రీడాకారుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు.సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో గ్రామీణ స్థాయి నుండి జాతీయ,అంతర్జాతీయ క్రీడా కారులను తయారు చేయడమే లక్ష్యంగా క్రీడలను ప్రోత్సహిస్తున్నారు అన్నారు. క్రీడాకారులకు ప్రొఫెషనల్ కోర్సులలో 0.5 శాతం,ప్రభుత్వ ఉద్యోగాలలో 2 శాతం ఇస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తుంది అని తెలిపారు.ఈ కార్యక్రమం లో ఆదివాసీ ఉద్యోగ సాంస్కృతిక సంఘాల అధ్యక్షులు పోలిబోయిన అనిల్ కుమార్,కోచ్ లు కొమరం వెంకట నారాయణ,పిడి.ఎస్. బాల సుబ్రమణ్యం,పిడి.కే. నిరజ్ కుమార్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !