మన్యం న్యూస్ గుండాల: ఉత్తమ పురస్కారం అందుకున్న ఆళ్లపల్లి ఏఎస్ఐ వెంకట్ రెడ్డి. బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఇదే పోలీస్ స్టేషన్ కు పై ఎస్ వర్టికల్ అవార్డు కూడా వచ్చింది మొత్తం ఐదు విభాగాలను సుందరంగా ఉంచినందుకు ఈ అవార్డు వరించింది. ఎస్ హెచ్ ఓ రూములు శుభ్రంగా ఉంచడం, స్టేషన్ ఆవరణంలో మొక్కలు పెంపకం, క్రైమ్ లో పట్టుబడిన వాహనాలను భద్రపరచడం, స్టేషన్ లోని పైళ్లను క్రమ సంఖ్యలో ఉంచడం, లాకప్ ను పరిశుభ్రంగా ఉంచడం వంటి వాటిపై అవార్డును ఎస్పీ ప్రకటించారు
