మన్యం న్యూస్ చండ్రుగొండ మే 25 : మంత్రి తన్నీరు హరీష్ రావును టీఎస్ఆర్టిసి జూనియర్ అసిస్టెంట్ క్వాలిఫైడ్ అభ్యర్థులు గురువారం హైదరాబాదులో కలిసి 2018లో తాము టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలో టిఎస్ఆర్టిసి లో జూనియర్ అసిస్టెంట్ గా క్వాలిఫై అయినామని, తమకు ఎటువంటి జాయినింగ్ ఆర్డర్స్ రాలేదని సమస్యను తెలియజేశారు. దీనికి స్పందించి మంత్రి వెంటనే టిఎస్ఆర్టిసి అధికారులతో ఫోన్లో మాట్లాడి, అభ్యర్థులకు తక్షణమే నియామకపత్రాలు అందజేయాలన్నారు. ఈ సమస్యపై మంత్రిని కలిసిన సంఘం రాష్ట్ర నాయకులు ఫిరోజ్ పాషా, చండ్రుగొండ అభ్యర్థి జలీల్ పాషా, వివిధ జిల్లాల అభ్యర్థులు శిరీష,సాయి తేజ, చైతన్య, సౌజన్య,అశ్విని తదితరులు పాల్గొన్నారు.
