మన్యం న్యూస్ చండ్రుగొండ ఆగస్టు 21 : మండల కేంద్రంలో ప్రధాన సెంటర్లో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు దారా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మెచ్చా నాగేశ్వరరావు పేరును ప్రకటించడంతో మండల పార్టీ శ్రేణుల్లో ఉత్సాహంతో, బాణాసంచా పేల్చి, మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ… నియోజకవర్గంలో సీసీ రోడ్లు, పంచాయతీ భవనాలు, అన్ని మండలాల్లో సెంట్రల్ లైటింగ్, నియోజకవర్గ కేంద్రంలో డయాలసిస్ సెంటర్, డిగ్రీ కాలేజ్, అనేక రకాలుగా అభివృద్ధి చేసిన ఘనతఅని,ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ అభివృద్ధిని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరు కేటాయించడం హర్షదాయకమన్నారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు నల్లమోతు వెంకటనారాయణ, సత్తి నాగేశ్వరరావు, సర్పంచ్ రన్యా నాయక్ ,సూరా వెంకటేశ్వరరావు, బడిగల శ్రావణ్ కుమార్, శ్రీను నాయక్, తలారి నాగరాజు, మల్లెల వెంకటేశ్వరరావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.