మన్యం న్యూస్ మణుగూరు:ఆగష్టు 21
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు మున్సిపాలిటీ పరిధి లోని,బాపన కుంట ఏరియాకు చెందిన నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పద్దం.శ్రీనివాస్ మామ కోరెం. నర్సయ్య అనారోగ్యంతో మరణించడంతో విషయం తెలుసుకొని,వారి నివాసానికి వెళ్లి కోరెం నర్సయ్య పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి,బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.పార్టీ తరుపున అన్నివిధాలా ఆదుకుంటామని వారికీ భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పోశం నర్సింహారావు,పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ,బిఆర్ఎస్ మణుగూరు పట్టణ కార్యదర్శి నవీన్,స్థానిక నాయకులు యువజన నాయకులు పద్దం శ్రీనివాస్,సృజన్, రంజిత్,సంపత్ దితరులు పాల్గొన్నారు.