లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్ వితరణ
మన్యం న్యూస్,అశ్వాపురం: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో మంగళవారం లయన్స్ క్లబ్ చాటర్ ప్రెసిడెంట్ పిల్లారిశెట్టి హరిబాబు కళాశాల విద్యార్థిని విద్యార్థులకు 40 జతల యూనిఫామ్ లను వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని అన్ని వనరులను ఉపయోగించుకుని విద్యార్థులు తమ జీవితంలో ఉన్నత స్థానాన్ని పొందాలని ఆకాంక్షించారు. అదేవిధంగా జిల్లా క్యాబినెట్ సెక్రటరీ సాతులూరు సత్యనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు తమ జీవితాల్లో అనుకున్నది సాధించడం ద్వారా వారు కూడా దానధర్మాలు చేయాలని ఆకాంక్షించారు. రీజినల్ చైర్మన్ జి రాజయ్య మాట్లాడుతూ లైన్స్ క్లబ్ కు సంబంధించిన జిల్లాలోని గొప్ప వ్యక్తులందరూ కళాశాలలు జరిగే కార్యక్రమానికి హాజరు కావడం ఇదే ప్రథమం అని, తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. అదే విధంగా జోనల్ చైర్మన్ కృష్ణమోహన్ మాట్లాడుతూ లైన్స్ క్లబ్ కళాశాల అభివృద్ధిలో పాత్ర వహిస్తుందని హామీ ఇచ్చారు. లయన్స్ క్లబ్ మణుగూరు ప్రెసిడెంట్ గాజుల పూర్ణచంద్రరావు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా లయన్స్ క్లబ్ పనిచేస్తుందని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్ జీ సమ్మయ్య, వ్యాపారవేత్త బేతంచర్ల వెంకటేశ్వర్లు, గాజుల రమేష్ అశ్వాపురం లయన్స్ క్లబ్ పాస్ట్ ప్రెసిడెంట్ రత్నాకర్, కళాశాల ప్రిన్సిపల్ సత్య ప్రకాష్, అధ్యాపక బృందం తార ప్రసాద్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.