బీ. ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డా. తెల్లం ని మర్యాద పూర్వకంగా కలిసిన యువజన విభాగంనాయకుల
మన్యం
న్యూస్,దుమ్ముగూడెం:భద్రాచలం
నియోజకవర్గ బి. ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకటరావును మంగళవారం మండల బీ. ఆర్.ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.శాలువా పుష్ప గుచ్చం తో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా యువజన నాయకులు మాట్లాడుతూ త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికలు లో డా. తెల్లం గెలుపును ఎవరు ఆపలేరని అన్నారు . ఇదివరకే మోసపోయి గోసపడ్డాం . ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త తెల్లం గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు . భద్రాచలం నియోజకవర్గం ఖమ్మం ,పినపాక తరహా అభివృధి సాధించాలంటే డాక్టర్ తెల్లం గెలుపుతో సాధ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు అల్లాడి వెంకటేష్,నరేంద్ర ,కొమ్ము రంజిత్ ,లంక శివ ,ఎస్కే అజిమ్, రబ్బానీ ,పూజారి రాజేష్ ,నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
