UPDATES  

 కేసీఆర్.. తెలంగాణకు పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోనూ పోటీ

తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్ పార్టీగా మార్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ అనేది కేవలం తెలంగాణకు సంబంధించిన పార్టీ కాదు. యావత్ దేశమంతా ఈ పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లో చేయడం ఒక వంతు అయితే.. పొరుగు రాష్ట్రమైన ఏపీలో పోటీ చేయడం మరో ఎత్తు. అసలు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందా? అనేదే తెలియదు. ఎందుకంటే.. 2023 లో తెలంగాణలో ఎన్నికలు రానున్నాయి. ఏపీలో మాత్రం 2024 లో వస్తాయి. 2024 లో అసెంబ్లీ, లోక్ సభ రెండు ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ పార్టీగా అవతరించాక.. బీఆర్ఎస్ పార్టీ ఏపీలో పోటీ చేస్తుందా?అనేది పెద్ద ప్రశ్నగా మారింది. కానీ.. ఏపీలో పోటీ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారట.

తెలంగాణ ఎన్నికలు పూర్తయ్యాక ఏపీలో ఎన్నికలు రావడానికి మరో సంవత్సరం సమయం పడుతుంది. ఈ సమయంలోపు ఏపీలో పుంజుకోవచ్చని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి.. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా? లేక ఎవరితోనైనా పొత్తు ఉంటుందా? అనేది మాత్రం తెలియదు. దేశమంతా విస్తరించే పనిలో ఉన్న కేసీఆర్.. తెలంగాణకు పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోనూ పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వేరే రాష్ట్రాల్లో పోటీ చేయానికి వెనుకాడని కేసీఆర్.. ఏపీలో మాత్రం ఎందుకు పోటీ చేయరు అనే ప్రశ్న ఎదురవుతోంది. అయితే.. ఏపీలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దానికి కారణం.. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన చాలామంది హైదరాబాద్ లో స్థిరపడ్డారు.

అందులో చాలామంది టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు. అందుకే.. అక్కడ ఎక్కువగా పోటీ చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అదంతా ఓకే కానీ.. బీఆర్ఎస్ పార్టీకి ఏపీలో ఇన్ చార్జ్ ను ఎవరిని నియమిస్తారు అనేది మాత్రం తెలియదు. ఏపీలో ఎంఐఎం పార్టీతో కలిసి పోటీ చేయాలని బీఆర్ఎస్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ బీఆర్ఎస్ తో కలిసి వచ్చే పార్టీలను కూడా అందులో కలుపుకొని పోయి ఎన్నికల్లో పోటీకి దిగనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఏపీకి ఒక ఇన్ చార్జ్ ను కూడా కేసీఆర్ త్వరలో నియమించనున్నారు. ఆంధ్రాకే చెందిన ఒక మాజీ మంత్రిని బీఆర్ఎస్ పార్టీ ఇన్ చార్జ్ గా నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !