UPDATES  

NEWS

జక్కన్న స్కెచ్… క్షమాపణలు చెప్పే కుటుంబం కాదు నాది : రాహుల్‌ గాంధీ.. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు.. నిర్వహణ ఏర్పాట్లపై ఈ నెల 28వ తేదీన మాక్ డ్రిల్.. హ్యాట్రిక్ పక్కా …..మళ్ళీ కేసీఆర్ సర్కారే… నేషనల్ పంచాయితీ అవార్డు అందుకున్న కాకర్ల గ్రామపంచాయతీ.సర్పంచ్, కార్యదర్శికి పురస్కారాన్ని అందించిన కలెక్టర్ అనుదీప్… ఇల్లందులో మెనూ పాటించని పోస్ట్ మెట్రిక్ వసతిగృహాన్ని పరిశీలించిన ఏటీడీఓ..మెనూ పాటించే విధంగా చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాల డిమాండ్.. శ్రీరామున్నే మభ్యపెట్టిన ఘనత కేసిఆర్….. సంతలకు తెలంగాణ వ్యాపారాలు రావద్దు..  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను పరిశీలించిన ఎమ్మెల్యే రాములు నాయక్.ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు హామీ.. మణుగూరు ఏరియాలో పర్యటించిన సింగరేణి ప్రాజెక్ట్,ప్లానింగ్ డైరెక్టర్ జి. వేంకటేశ్వర రెడ్డి..

 అదిరిపోయే డిజైన్ తో వస్తున్న మోటరోలా ఫోన్లు

మోటరోలా ఎడ్జ్ సీరిస్ నుంచి రెండు కొత్త ఫోన్లను ఈ నెల 13న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. చైనాకు చెందిన లెనోవో అనుబంధ కంపెనీ అయిన మోటరోలా ఇటీవలి కాలంలో భారత మార్కెట్లో చురుకైన మార్కెటింగ్ స్ట్రాటజీని అమలు చేస్తోంది. పలు ధరల శ్రేణిలో వరుసగా స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరిస్తూ, మార్కెట్ వాటాను పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది.

ఖరీదైన శ్రేణిలో ఎడ్జ్ 30 అల్ట్రా, ఎడ్జ్ 30 ఫ్యూజర్ ఫోన్లను 13వ తేదీన విడుదల చేయనుంది. ఆకర్షణీయమైన ప్రీమియం డిజైన్ కు తోడు, వీటిల్లో కొన్ని కొత్త ఫీచర్లు కూడా ఉండనున్నాయి. మోటో ఎడ్జ్ 30 అల్ట్రా 6.67 అంగుళాల ఫుల్ హెడ్ డీ ప్లస్ ఓఎల్ఈడీ కర్వ్ డ్ డిస్ ప్లే, 144 హెర్జ్ రీఫ్రెష్ రేటు, కార్నింగ్ గొరిల్లా 5 గ్లాస్ ప్రొటెక్షన్ తో ఉంటుంది. క్వాల్ కామ్ ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్ 8 ప్లస్ జనరేషన్ 1ను ఇందులో ఏర్పాటు చేశారు. 200 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా ప్రత్యేకతగా చెప్పుకోవాలి. అలాగే, 50 మెగా పిక్సల్, 12 మెగా పిక్సల్ తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు భాగంలో 60 మెగా పిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు.

ఇక ఎడ్జ్ 30 ఫ్యూజన్ 6.55 అంగుళాల డిస్ ప్లే, 144 హెర్జ్ రీఫ్రెష్ రేటుతో రానుంది. స్నాప్ డ్రాగన్ 888 ప్లస్ చిప్ సెట్ ఇందులో ఉంటుంది. 50 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా ఏర్పాటు చేశారు. వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు భాగంలో 32 మెగా పిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. యూరోప్ లో ఇవి ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయి. అక్కడి ధరల ప్రకారం ఎడ్జ్ 30 అల్ట్రా రూ.73వేలు, ఎడ్జ్ 30 ఫ్యూజన్ ఆరంభ ధర రూ.48,000గా ఉంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !