సీఎం సహాయక నిధి పేదల పాలిట వరం
పేదల ఆరోగ్యానికి సర్కార్ భరోసా
ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యం న్యూస్ మణుగూరు:
మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ముత్యాలమ్మ నగర్ గ్రామానికి చెందిన పగిళ్ల శోభకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన 48 వేల రూపాయల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు స్థానిక ప్రజాప్రతినిధులు,పార్టీ ముఖ్య నాయకులతో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా విప్ రేగా కాంతరావు మాట్లాడుతూ, అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారింది అన్నారు, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత ఉపయోగపడుతున్నదని అన్నారు.అన్ని వర్గాల వారికి అండగా ఉంటూ సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోశం నరసింహారావు,పిఎసిఎస్ చైర్మన్ కుర్రి.నాగేశ్వరరావు, స్ధానిక ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,పార్టీ సీనియర్ నాయకులు,యువజన నాయకులు,మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.