UPDATES  

NEWS

ఘనంగా కొండలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు… భక్తులకు అన్నదానం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు పట్ల నల్ల బ్యాడ్జిలతో నిరసన ర్యాలీ : ఏఐటియుసి పోరాట ఫలితమే 32శాతం లాభాలవాటా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సారయ్య *హరిప్రియ ఫౌండేషన్ ఉచిత వైద్యశాల సేవలు అభినందనీయం మారుమూల గ్రామానికి కరెంటు లైన్ క్లియర్ మామిళ్ళవాయికి త్రీ పేజ్ విద్యుత్ లైన్ మంత్రి కేటీఆర్ మాటలు సరి కాదు తెదేపా ఇల్లందు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ మణుగూరు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కు 20 కోట్ల రూపాయల నిధుల మంజూరు పలు శుభకార్యాలకు హాజరైన రేగా సుధారాణి మణుగూరు సిఐ బాలాజీ వరప్రసాద్ ఆకస్మిక బదిలి

 నిలువెత్తు నిదర్శనం! * యాష్ ట్యాంకర్ తొలగింపుకు చర్యలేవి

నిలువెత్తు నిదర్శనం!
* యాష్ ట్యాంకర్ తొలగింపుకు చర్యలేవి
* రైల్వే అండర్ బ్రిడ్జితో ఇబ్బందులు
* ఐదు రోజులు అవుతున్న కానరాని స్పందన
* ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజాసంఘాల నేతలు

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ఈనెల 13వ తేదీన అర్ధరాత్రి రైల్వే అండర్ బ్రిడ్జి మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించిన విషయం తెలిసింది. పాల్వంచ నుండి వస్తున్న యాష్ ట్యాంకర్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్దకు రాగానే అటుగా వస్తున్న ఇద్దరు వ్యక్తులపై పడి వారి మరణానికి కారణమైంది.
అయితే అండర్ బ్రిడ్జిలో బోల్తా పడిన యాష్ ట్యాంకర్ ను నేటి వరకు తొలగించకపోవడం పట్ల అధికారులలో నిర్లక్ష్యం నిలువెత్తు నిదర్శనం స్పష్టంగా కనిపిస్తుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు రోజులు కావస్తున్న ట్యాంకర్ ను తొలగించే విషయంలో ఎవరి నిర్లక్ష్యం ఉందో అర్థం కావడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో అడ్డంగా ఉన్న ట్యాంకర్ వల్ల ఇటు ద్విచక్ర వాహనదారులు అటు నడక సాగించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అడ్డుగా ఉన్న యాష్ ట్యాంకర్ ను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

   TOP NEWS  

Share :

Don't Miss this News !