UPDATES  

 ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి.

ఆదివాసీల స్వయంపాలన ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలి.

ఆదివాసి సీనియర్ రాష్ట్ర నాయకులు పూనెం.సాయి దొర
మన్యం న్యూస్,
నూగురు వెంకటాపురం:
శ్రీకాకుళం నుండి ఆదిలాబాద్ వరకు విస్తరించి ఉన్న ఆదివాసుల భూభాగమంతా కలిపి ఆదివాసులకు ప్రత్యేక స్వయం పాలన ఏర్పాటు చేయాలని ఆదివాసి సీనియర్ రాష్ట్ర నాయకులు పూనెం. సాయి దొర డిమాండ్ చేశారు. ఆదివారం వెంకటాపురం విశ్రాంతి భవనం ఆవరణంలో ఆదివాసి నాయకులు కనితి.వెంకటకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రస్తావించారు. శ్రీకాకుళం నుండి అదిలాబాదు వరకు విస్తరించి ఉన్న ఆదివాసి గుడాలను అంతా కలిపి ఆదివాసులకు భారత రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్ ప్రకారంగా ప్రత్యేకంగా స్వయం పరిపాలన ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలో ఆదివాసీలకు స్వయం పాలన ఏర్పాటు చేస్తామని రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని పార్టీలను ఆయన డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే వెంటనే ఆదివాసులకు ప్రత్యేకంగా స్వయం పరిపాలన ఏర్పాటు చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివాసులకు గతంలో హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.ఆదివాసుల పై ఈ తెలంగాణ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతోందని ఆయన ఆరోపించారు. ఆదివాసీలను ముక్కలు చెక్కలుగా విభజించి పాలిస్తున్నారనిఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరా తీసుకొని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు కోసమే వాడుకుంటున్నారని,ఏజెన్సీ ప్రాంతాల నుండి రాజకీయ పార్టీలను బహిష్కరించాలని ఆదివాసులకు పిలుపునిచ్చారు. ఆదివాసులకు ప్రత్యేక స్వయం పరిపాలన ఏర్పాటుకు ఆదివాసులు అంతా ఐక్యంగా ఉద్యమించాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో రవి, సూర్యం,పార్ధు,మోహన్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !